రోటరీ క్లబ్ యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యువజన ఉత్సవాల్లో భాగంగా ఉత్సవాలు ముగింపు రోజున మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని "రంగం2024" విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ వారు నిర్వహించిన ఉత్సవాలు చాలా బాగున్నాయి అని కొనియాడారు. విద్యతో పాటు ఆటపాటలు అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు రాణించాలని తెలిపారు.