కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును తొండంగి మండలం ఏ. కొత్తపల్లిలో గురువారం నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సుకు ప్రభుత్వ విప్ యనమల దివ్య పాల్గొని రైతుల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి హక్కు సమస్యలు, పట్టాదార్పట్టాదారు పాస్ పుస్తకాల పేరు మార్పులు, సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. యనమల రాజేష్, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.