రెండు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది

78చూసినవారు
నాగాయలంక మండలం ఎదురుమొండి దీవిలో రెండు గ్రామాలతో మార్గం తెగిపోయి రవాణా రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం బుధవారం ఏర్పడింది. కృష్ణా వరద ఉధృతికి ఎదురుమొండి దీవిలో జింకపాలెం, గొల్లమంద గ్రామాలకు సంబంధాలు తెగి పోనున్నాయి. ఆ గ్రామాలకు వెళ్లే కరకట్ట రహదారి పూర్తిగా కృష్ణానదిలోకి కుప్పకూలిపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర కలవరం చెందుతున్నారు. ఆ గ్రామాలకు వెళ్లే దారి మరొకటి లేకపోవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్