పంట కాలువలో వ్యర్ధాలు వేయవద్దని అవనిగడ్డ ఎస్ఐ కే. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ప్రధాన పంట కాలువ సమీపంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, మాంస దుకాణాల నిర్వాహకులకు ఎస్ఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. దివిసీమకు తాగు, సాగునీరు అందించే ప్రధాన పంట కాలువలో వ్యర్ధాలు వేసి నీటిని కలుషితం చేయవద్దని హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.