వర్షాల నేపథ్యంలో విద్యుత్ మోటర్లు ముట్టుకోవద్దు

59చూసినవారు
వర్షాల నేపథ్యంలో విద్యుత్ మోటర్లు ముట్టుకోవద్దు
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తు మోటార్లను అంటుకోవద్దని విద్యుత్ శాఖ చల్లపల్లి ఏఈ అరవింద్ కుమార్ శనివారం సూచించారు. ఇళ్ళు, పొలాల్లో కరెంట్ మోటార్లు, స్టార్టర్స్, డబ్బాలు తడిచి వుంటాయని తెలిపారు. గాలులకు సర్వీసెస్ వైర్లు డామేజ్ అవుతాయని, స్తంభాలు పడిపోయి తీగలు తెగి ప్రమాదకర పరిస్థితి ఉంటుందన్నారు. రైతులు పొలాల్లో కరెంట్ మోటార్లు, స్టార్టర్స్ ముట్టుకొనే ప్రయత్నం చేయవద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్