అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక గ్రామాన్ని గురువారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. కృష్ణా నది వరద ముంపు బారిన పడి తేరుకున్న గ్రామాన్ని, ఎస్టి, ఎస్సీ కాలనీలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. ఇళ్ళు శుభ్రం చేసుకుంటున్న గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు.