బంటుమిల్లి: నిర్ణీత గడువులో ధృవీకరణ పత్రాలు సమర్పించాలి
పింఛనుదారులు వార్షిక ధృవీకరణ పత్రములు నిర్ణీత గడువులోపు మాత్రమే సమర్పించాలని బంటుమిల్లి ఉప ఖజానా అధికారి కె. గోపికృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పింఛనుదారులు వార్షిక ధృవీకరణ పత్రమును (యాన్యూవల్ వెరిఫికేషన్ లైఫ్ సర్టిఫికెట్ ) జనవరి 2025 నుండి 2025 ఫిబ్రవరి లోపు మాత్రమే సమర్పించాలని ఉప ఖజానా అధికారి గోపికృష్ణ స్పష్టం చేశారు.