నాగాయలంక: ఐటీ దాడుల కలకలం
కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం, ఐస్ ఫ్యాక్టరీ మరియు ఇతర సంస్థలపై బుధవారం ఐటీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్‌తో ఆయన ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.