చల్లపల్లి మండలంలోని నరకోత్తారక క్షేత్రం నడకుదురు శ్రీపృద్వీశ్వర క్షేత్రంలో నరక చతుర్దశిని పురస్కరించుకుని నాటి నరకాసుర సంహారాన్ని నేటితరానికి తెలియచేసేలా బుధవారం రాత్రి నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని నరకాసుర వధలో పాల్గొన్నారు. నరకాసురుని పోలిన గడ్డి బొమ్మను తయారుచేయగా, ఎమ్మెల్యే నిప్పు వెలిగించిన బాణాన్ని నరకాసురుని పైకి వదిలారు.