డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మేడికొండూరు మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జమీల్ అహ్మద్ బేగ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో బిఆర్ అంబేద్కర్ కీలకపాత్ర వహించారని తెలిపారు. దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుబడిన మహా నేతఅని కొనియాడారు.