ప్రజల చిన్నచిన్న సమస్యలు పరిష్కారానికి గత పాలకులకు సంవత్సరాలు పట్టిందని రాబోవు నాలుగేళ్లలో గుడివాడ ప్రగతి పథంలో పయనిస్తుందని అన్ని రంగాల్లో గుడివాడను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. శనివారం గుడివాడ శ్రీకాళహస్తి కాలనీలో 29 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న నూతన పైప్ లైన్ నిర్మాణ పనులకు అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భూమి పూజ చేశారు.