బుడమేరు వరద ముంపు బారిన పడిన గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నందివాడ మండలంలోని అరిపిరాల, పోలసివారిపాలెం, రామాపురం, ఇలపర్రు గ్రామాలు బుడమేరు వరద ముంపు బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ గుడివాడ మున్సిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేశారు.