క్రీస్తు బోధనలు ప్రజలను సన్మార్గంలో నడిపించేందుకు దోహద పడతాయని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య}తెలిపారు. బుధవారం క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామం సాయిబాబా గుడి క్రాస్ రోడ్ సమీపంలో గెలీలియో బాపిస్ట్ మినిస్ట్రీస్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} హాజరయ్యారు.