సోలార్ మీటర్ వల్ల కరెంట్ ఆదా చేసుకోవడమే కాకుండా అనవసరమైన భారం ప్రజలపై ఉండదని మాజీ శాసనమండలి సభ్యులు తొండపు దశరధ జనార్ధన్ తెలిపారు. వత్సవాయి మండలం, మక్కపేట గ్రామంలో సోలార్ స్మార్ట్ మీటర్ల కార్యాలయాన్ని తొండపు దశరధ జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సోలార్ స్మార్ట్ మీటర్ వల్ల ఎస్ సి, ఎస్ టి లకు 200 యూనిట్లు లోపు ఉచిత కరెంట్ ఇస్తుందన్నారు.