గొర్రెలను వాహనం ఢీకొన్న ఘటనలో పలు గొర్రెలు మృతి చెందిన సంఘటన మంగళవారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిల్లకల్లు రోడ్డులో గొర్రెలను వాహనం ఢీకొంది. ఈ ఘటనలో జగ్గయ్యపేట రూరల్ మండలం బలుసుపాడు గ్రామంకి చెందిన రమేష్ గొర్రెలు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న చిల్లకల్లు పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.