జిల్లాలో విద్యార్థులందరూ సులభతరంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శనివారం మచిలీపట్నంలో జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు సులభంగా సాధారణంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాష, వ్యాకరణం ఎలా బోధించాలని అనే విషయంపై ప్రేరణాత్మక సందేశాన్నిచ్చారు.