జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ నందు ఇన్సూరెన్స్ క్లెయిమ్ విధానం ద్వారా మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు భరోసా కల్పించటం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. ఏఎస్ఐ సుబ్బారావు మరణించగా, కో-ఆపరేటివ్ సొసైటీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ విధానం ద్వారా మరణించిన ఏఎస్ఐ చెల్లించాల్సిన రూ. 3, 15, 000 రుణమాఫీ చేసి సర్టిఫికెట్ ను మచిలీపట్నంలో సోమవారం ఎస్పీ కుటుంబానికి అందజేశారు.