చేనేత మరియు జౌళి శాఖ కృష్ణాజిల్లా సహాయ సంచాలకులుగా సాయి ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు ఫణి కుమార్ తదితరులు మచిలీపట్నంలో కలసి పుషగుచ్చం ఇచ్చి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు అనుమతించిన సందర్భంగా పెడనలో ప్రత్యేకించి మహిళల కొరకు, మహిళ సభ్యులతో సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.