ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై గ్రామ /వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి ఆన్లైన్ పోర్టల్ సీఎం ప్రారంభించనున్నారని తెలిపారు.