కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428వ ఉరుసు మహోత్సవాలు జనవరి 9, 10, 11 తేదీలలో జరగనున్నాయి. ఈ ఉరుసు మహోత్సవాలకు ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా కమిటీ సభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాదుకి ఆహ్వానం అందించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని కార్యాలయంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణప్రసాదుని మంగళవారం కలిశారు.