రైతులు తాము సాగు చేసిన పంటలను వెంటనే ఈ క్రాప్ లో నమోదు చేయించుకోవాలని కంచికచర్ల మండల వ్యవసాయ అధికారి కె. విజయ్ కుమార్ మంగళవారం కోరారు. భూమికి పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం , నకలు తీసుకొని రైతు సేవా కేంద్రాలకు వచ్చి వివరాలు అందజేయాలన్నారు. ఈ క్రాప్ లో నమోదు కాకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీని కోల్పోయే అవకాశం ఉందన్నారు.