నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ గా నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట వీరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 17 డీసీ కమిటీల ఛైర్మన్లు ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.