విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పిలుపునిచ్చారు. పవర్ మిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పవర్ మిక్ సంస్థ ప్రతినిధులు విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తుకు కష్టపడి చదవాలని పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలును అందించడం అభినందనీయమన్నారు