ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పెడన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. శనివారం పెడనలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.