జ్యోతిరావు పూలే ఉత్తమ ఉపాధ్యాయినీ అవార్డుకు పెడనలోని పల్లోటి పాఠశాల ఉపాధ్యాయురాలు సరోజనీ జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు. కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ లక్ష్మణరావుచే అవార్డు ఈమె అందుకున్నారు. సోమవారం పల్లోటి పాఠశాల ప్రిన్సిపల్ &కరస్పాండెంట్ ఫాథర్ జాల యాకోబు, పాఠశాల డీన్ రాజీవ్ తో కలసి దుశ్సాలువాతో సత్కరించారు. తదుపరి తోటి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు.