పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలోని ప్రధాన కాలువ పరిధిలో దాల్వా సాగుకు అనుమతి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం దీక్ష ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలుగా ధాల్వా లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ నిరసనలో 41 మంది రైతులు పాల్గొన్నారు.