ప్రమాదంగా ఉన్న గండిని రాత్రి వేళ పూడ్పించిన ఎమ్మెల్యే

63చూసినవారు
పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరావుపేట గ్రామంలో ఉన్నటువంటి పంట కాలువ నీటి ప్రవాహం పెరగడం గమనించి గండి పడే అవకాశం ఉందని గ్రామస్తులు శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ కు ఆదివారం రాత్రి తెలియజేశారు. వెంటనే కాలువ గండికి గురయ్యే ప్రదేశాన్ని పరిశీలించి జెసిబిలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి గంటల సమయం వ్యవధిలో ప్రమాదంలో ఉన్న ప్రాంతాన్ని గండి పూడ్పించి సురక్షిమైన ప్రాంతంగా మార్చారు.

సంబంధిత పోస్ట్