ఉయ్యూరులో యువకుల వీరంగం

547చూసినవారు
పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరు పట్టణంలో యువకులు వీరంగం సృష్టించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రతినిత్యం రద్దీగా ఉండేటటువంటి ఉయ్యూరు ప్రధాన రహదారి సెంటర్లో కొందరు యువకుల మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితిని కల్పించడమే కాకుండా వీరంగం సృష్టించారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్