ఎన్నటికీ పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేయను అని రాష్ట్ర సమాచార పోర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. తాడిగడప లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన విగ్రహావిష్కరణ పార్టీలకు అతీతంగా జరిగిందని ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి వైసీపీ నాయకుడు జోగి రమేష్ కూడా వచ్చారని ముందుగానే ఈ విషయం తెలిసి ఉంటే కార్యాక్రమానికి హాజరు అయ్యేవాడినే కాదన్నారు