తాడిగడప మున్సిపాలిటీలోని తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్ ల కార్మికులు మంగళవారం అర్ధనగ్నంగా ప్రదర్శననిర్వహించారు. ఈ సందర్భంగా
పెనమలూరు మండలం సిఐటియు కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ చెత్త వ్యాన్ డ్రైవర్ ల కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 8వ రోజుకి చేరిందని అయినా అధికారులు స్పందించటం లేదని కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించటం లేదని ఆరోపించారు.