బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణభివృద్ధి శాఖమంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కంకిపాడులో జరిగిన కెడ్రాయ్ సౌత్ కాన్ 2024 సమ్మిట్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి బిల్డర్లు, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు..