వరద బాధితులకు తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం

69చూసినవారు
వరద బాధితులకు తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఆంధ్రప్రదేశ్ లో వరదలతో అతలాకుతలం అవుతుంది. చాలా మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్కొక్కరుగా తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాగా నేడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ ద్వారా అందించారు. తమ వంతుగా సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని,ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఘటన నుండి బయట పడాలని ట్రస్టీ మునగాల యజుర్వేద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్