తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం నడిచింది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. మెయిన్ రోడ్ మాస్టర్ ప్లాన్ లో 100 అడుగులకు విస్తరించాలని నిర్ణయించడం పై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు, చైర్ పర్సన్ కస్తూరి బాయ్, కమీషనర్ లోవరాజు పాల్గొన్నారు.