విజయవాడలో ఎక్కడకక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు వాహనాలను నడిపే వ్యక్తులకు హెల్మెట్ తప్పనిసరి కావడంతో హెల్మెట్ ధరించకుండా వారిపై విజయవాడ పోలీసులు సోమవారం కొరడా విధించారు. ఈ నేపథ్యంలో రింగ్ సెంటర్ నందు ఇద్దరు ఎస్ఐలు పది మంది కానిస్టేబుల్స్ తో ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లను, వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పక్షంలో వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.