రాష్ట్రంలోని రవాణా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కమిషనర్ కార్యాలయంలో బుధవారం కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కృష్ణ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా కు రవాణా రంగంలోని సమస్యలు పరిష్కరించిలారీ ఓనర్స్ ను ఆదుకోవాల్సిందిగా కోరారు.