విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరి నాటికి కాంక్రీట్ పనులు పూర్తి అవుతాయి. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి జూన్ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమనాశ్రయంలో శనివారం ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం పాల్గొన్నారు.