లోకో పైలెట్ ను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..

81చూసినవారు
లోకో పైలెట్ ను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..
విజయవాడలో గంజాయి మత్తులో ఉన్న నిందితుడు, లోకో పైలట్ డి. ఎబినేజర్ పై దాడి చేసి హత్య చేశాడు. గురువారం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘోరం, డ్యూటీ టైమ్ లో ఎబినేజర్ వస్తున్నప్పుడు జరిగింది. డబ్బు కోసం చేసిన దాడిలో అతను తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా ఇదివరకు కూడా ఓ హత్య చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్