ఎలాగైనా డాక్టర్లు కావాలన్న లక్ష్యంతో వారంతా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్నారు. ప్రాక్టీస్ పెట్టి ప్రజలకు సేవ చేయవచ్చు అనుకున్నారు. కానీ ఏపీ మెడికల్ కౌన్సిల్ వారి ఆశలకు గండికొట్టింది. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతోంది. లైసెన్స్‌లు ఇవ్వండి అని మొరపెట్టుకుంటున్నా పొంతనలేని సమాధానాలు సోమవారం విద్యార్థులు రోడ్డెక్కారు.