అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ సోమవారం అందజేశారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. 29 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు.