అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో నియోజకవర్గంలో డ్రైనేజీల అభివృద్ధి పనులకు రూ. 3 కోట్లు మంజూరయినట్లు మండలి వెంకట్రామ్ తెలిపారు. గురువారం చల్లపల్లి మండలం లక్ష్మీపురం వద్ధ నుంచి మాజేరు వరకు గుండేరు మేజర్ డ్రైనేజీలో కిక్కిస తొలగింపు పనులను ప్రారంభించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నిధులు రూ. 27. 63 లక్షలతో లక్ష్మీపురం నుంచి మాజేరు వరకూ గుండేరు మేజర్ డ్రైనేజీతో పనులు జరుగనున్నాయి.