చల్లపల్లి: బిఎల్ఓలుగా కేటాయించటంపై అభ్యంతరం

70చూసినవారు
చల్లపల్లి: బిఎల్ఓలుగా కేటాయించటంపై అభ్యంతరం
ఇప్పటివరకు బూత్ లెవెల్ ఆఫీసర్ (బి ఎల్ వో) డ్యూటీలను నిర్వహించిన వీఆర్వోలను పక్కనపెట్టి వారి స్థానంలో మహిళా పోలీసులకు బిఎల్ఓ డ్యూటీలను కేటాయించడంపై చల్లపల్లి మండల మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఇన్ చార్జ్ తహాసిల్దార్ శ్రీలతకు వినతిపత్రం సమర్పించారు. నియమ నిబంధనలను అనుసరించి ప్రాధాన్యత క్రమంలో బిఎల్ఓలుగా నియమించినట్లయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్