ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం నందు ప్రపంచ మత్స్య దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కెవికె సమన్వయకర్త డా. డి. సుధారాణి మాట్లాడుతూ మత్స్యకారులకు గుర్తింపును అందించటం కోసం, మత్స్య పరిశ్రమకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతో నవంబరు 21న జరుపుకుంటారని తెలిపారు. కెవికె మత్స్య శాస్త్రవేత్త జె. యశ్వంత్ కుమార్ ప్రపంచంలోని మత్స్య సంపదను కాపాడుకునే విధంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు.