గడచిన నాలుగో నెలలుగా గౌరవ వేతనం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ వాలంటీర్లకు గౌరవ వేతనాన్ని చెల్లించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ను వాలంటీర్లు కోరారు. మంగళవారం అవనిగడ్డలో ఎమ్మెల్యేను మండలంలోని గ్రామ వాలంటీర్లు కలిసి తమ సమస్యలు విన్నవించి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని, రాజీనామాలు కూడా చేయలేదని తెలిపారు. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.