మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నాగ పుట్ట వద్ద పాలు పోసి నాగవల్లి వృక్షానికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.