ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గానికి భారీగా వరద నీరు రావడంతో గ్రామాల్లో పారిశుద్ధ చర్యలను ముమ్మరం చేస్తున్నారు. నాగాయలంక మండల పరిధిలోని చిన్న కరకట్ట పల్లెపాలెం వద్ద బ్లీచింగ్ చల్లే పనులను శుక్రవారం పంచాయతీ చేపట్టింది. అదేవిధంగా మోపిదేవి మండల పరిధిలోని కే. కొత్తపాలెం ఎస్సి కాలనీ, బీసీ కాలనీల్లో పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులను చేపట్టారు.