అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో అక్రమ మట్టి, బుసక, ఇసుక త్రవ్వకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ సీఐ జి. యువ కుమార్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలో మాట్లాడుతూ, అక్రమంగా మద్యం షాప్ ల నుండి లిక్కర్ సరఫరా చేసినా, గ్రామాల్లో మద్యాన్ని అమ్మినా చర్యలు తప్పవన్నారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపినట్లు వివరించారు. అతి త్వరలో గంజాయి భాదితుల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నామని తెలిపారు.