బండారు గూడెంలో గాంధీ జయంతి వేడుకలు
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్ వడ్లమూడి అమ్మాజీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.