ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ గ్రామాలు అయిన పాతపాడు, నైనవరం అంబాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.