ఎలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ జూనియర్ జాతీయ ఖోఖో జట్టుకి పదిరోజుల నుండి నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసినట్లు జిల్లా కోకో సంఘ అధ్యక్షులు మడక ప్రసాద్ తెలిపారు.వీరు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్2 వరకు జార్ఖండ్ రాష్ట్రంలోని భిలాయ్ లో జరగబోయే 34వ జాతీయ ఖోఖో పోటీలలో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్య ప్రసాద్ పిఈటీ లు రవి,సోమేశ్వరావు పాల్గొన్నారు.