ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసుక్రీస్తు దీవెనలు ఉండాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ప్రజలకు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రిస్మస్ పండగ మీ జీవితాల్లో కొత్త పుంతలు తొక్కాలని అన్నారు.